ఏపీ రాజధాని అమరావతిపై అసత్య ప్రచారం చేసిన కేసులో పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ గుంటూరు జిల్లా తాడేపల్లి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. ఆయనను సుమారు గంటన్నరపాటు పోలీసులు విచారించారు. మొత్తం 8 ప్రశ్నలు సంధించగా.. ఎక్కువ ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు అని ఆయన సమాధానం ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. మురళీకృష్ణ సమాధానాలను న్యాయస్థానానికి నివేదిక రూపంలో ఇస్తామని సీఐ వీరేంద్రబాబు తెలిపారు.