వైసీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: భూమన

17చూసినవారు
AP: టీడీపీ సోషల్ మీడియాపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి  రోజా తలనీలాలు సమర్పించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని భూమన ఖండించారు. జరగని విషయాలను జరిగినట్లుగా చూపిస్తూ వ్యక్తిత్వ హననం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేసేందుకు జీతగాళ్లను తయారు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ సొమ్మును ఐటీడీపీ ద్వారా టీడీపీ కార్యకర్తలకు వినియోగిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్