AP: ఫలితాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఇంటర్ బోర్డు ఖండించింది. ఏప్రిల్ 12న రిజల్ట్స్ విడుదలవుతాయనే వార్తలు పూర్తిగా అబద్ధమని స్పష్టం చేసింది. ఫలితాల తేదీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, విద్యార్థులు ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మి ఆందోళన చెందొద్దని సూచించింది. ఫలితాల తేదీలను అధికారికంగా వెలువరిస్తామని సూచించింది.