పాక్ పాఠ్యపుస్తకాల్లో హిందువులపై తప్పుడు బోధనలు!

9165చూసినవారు
పాక్ పాఠ్యపుస్తకాల్లో హిందువులపై తప్పుడు బోధనలు!
పాకిస్తాన్ పాఠశాలల్లో హిందువులు, సిక్కుల గురించి బోధించే విషయాలు అక్కడి మత సామరస్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఓ  నివేదిక వెల్లడించింది. 8వ తరగతి సోషల్ స్టడీస్ పుస్తకంలో హిందువులు తమ కూతుళ్లను సరిగ్గా చూసుకునేవారు కాదని, ప్రాచీన కాలంలో వారిని సజీవంగా పాతిపెట్టేవారని బోధిస్తున్నారని ఓ వ్యక్తి ఆరోపించారు. 11వ, 12వ తరగతుల పాక్ స్టడీస్ పాఠ్యపుస్తకం 33వ పేజీలో హిందువులు, సిక్కులు వేలాది మంది ముస్లిం మహిళలు, పిల్లలు, వృద్ధులను నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా చంపారని, అత్యాచారం చేశారని రాసి ఉన్నట్లు వివరించాడు.  హిందువులు అమానవీయులనే తప్పుడు అభిప్రాయాన్ని విద్యార్థుల మనస్సుల్లో నాటుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్