మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరిట తప్పుడు ట్వీట్

93చూసినవారు
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరిట తప్పుడు ట్వీట్
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో మార్ఫింగ్ చేసిందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలో, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరిట తప్పుడు ట్వీట్ చేశారని జనసేన నేత వి.నారాయణరావు ఆరోపించారు. నాదెండ్ల భాస్కరరావుకు ట్విట్టర్ అకౌంట్ లేదని, ఆయనకు ఈ పోస్టుతో సంబంధం లేదని మంగళవారం తెనాలి వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్