కుటుంబ పార్టీలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం: విజయసాయిరెడ్డి

12184చూసినవారు
కుటుంబ పార్టీలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం: విజయసాయిరెడ్డి
AP: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆదివారం సంచలన ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా.. ‘రెండు కుటుంబ రాజకీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదు. ఇందుకు సంబంధించిన మరికొన్ని ఆధారాలను ఈ నెల 30న ఉ.11 గంటలకు విశాఖపట్నంలోని దస్‌పల్లా హోటల్‌ వేదికగా వివరిస్తాను. ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయం, నేటి రాజకీయాల్లో తెరవెనుక పొత్తులు, గిరిజనులు టార్గెట్‌గా జరుగుతున్న మత మార్పిడిలు వంటి విషయాలపై చర్చిస్తాను’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్