రీల్స్‌తో ఫేమస్.. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన యువతి

16చూసినవారు
AP: ఒంగోలు 27వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన 24 ఏళ్ల చావలి చర్పిత ఘనవిజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె రూపొందించిన సోషల్ మీడియా రీల్స్ ఓటర్లను విశేషంగా ఆకర్షించాయి. ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఆమె చేసిన ప్రచార శైలి నెట్టింట వైరల్‌గా మారింది. వినూత్నంగా ప్రచారం నిర్వహించి, చిన్న వయసులోనే కార్పొరేటర్‌గా ఎన్నికైన చర్పిత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమె ఎన్నికల వ్యూహం, ప్రజాదరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత పోస్ట్