అమరావతి వెళ్లే ఆర్టీసీ ఏసీ బస్సుల ఛార్జీలు తగ్గింపు

14004చూసినవారు
అమరావతి వెళ్లే ఆర్టీసీ ఏసీ బస్సుల ఛార్జీలు తగ్గింపు
విశాఖపట్నం నుంచి అమరావతి వెళ్లే ఏపీఎస్ఆర్‌టీసీ ఏసీ బస్సుల ప్రయాణ ఛార్జీలను 10 శాతం తగ్గించినట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు గురువారం తెలిపారు. ఏసీ బస్సు టిక్కెట్‌ సాధారణ ఛార్జీ రూ.1860, ఇతర మార్గాల గుండా వెళ్లే బస్సుల ఛార్జీలు రూ.1690, రూ.1640 ఉన్నాయని అన్నారు. 10 శాతం ఛార్జీల తగ్గింపు ఆగస్టు 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందన్నారు. ప్రయాణికులు ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్