పరిహారం కోసం తిప్పించుకున్నందుకు.. అధికారిని చెప్పుతో కొట్టిన రైతు

18653చూసినవారు
కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో భూసేకరణ పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగిపోయిన రైతు బసప్ప దొడమణి.. శనివారం టౌన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో ఒక అధికారిపై చెప్పుతో దాడి చేశాడు. ఈ ఘటనతో కార్యాలయంలో కలకలం రేగింది. కొందరు అధికారులు భయంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్