AP: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా తీవ్రంగా విరుచుకుపడ్డారు. గత 15 నెలలుగా రైతులు యూరియా కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి నరకం చూస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, భరోసా పేరుతో ఐదు వేలు తప్పా ఎలాంటి సహాయం చేయలేదని అన్నారు. రైతు సమస్యలు పరిష్కరించలేకపోతే కూటమి దిగిపోవాలని డిమాండ్ చేశారు.