ఏపీలో టమాటా రైతులు కంట నీరు పెడుతున్నారు. హోల్‌సేల్ మార్కెట్లో 30 కేజీల బాక్స్ ధర కేవలం 30 రూపాయలు, అంటే కిలో టమాటా ఒక్క రూపాయే పలకడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. విత్తనాలు, ఎరువులు, రవాణా ఖర్చులు కూడా రావడం కష్టంగా మారడంతో మార్కెట్‌కు పట్టికెళ్లలేక, రైతులు పంటను రోడ్లపై పారబోస్తున్నారు. ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ప్రకటించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.