పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ అవినాష్ రెడ్డి

31చూసినవారు
పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ అవినాష్ రెడ్డి
AP: వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చల్ల బసాయపల్లిలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటించారు. మొక్కజొన్న, అరటి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2400 ఉండగా, రూ.1400కే అమ్ముకోవాల్సి వస్తోందని, అరటి ధర కూడా టన్నుకు రూ.2-3 వేలకు పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా, ఏపీలోనూ వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, అరటి పంటకు కనీసం టన్ను రూ.10-12 వేల ధర వచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you