కష్టాల్లో ఉన్న కుటుంబాలకు వైసీపీ కార్యకర్తలు అండగా నిలవాలి: పేర్ని నాని

1509చూసినవారు
కష్టాల్లో ఉన్న కుటుంబాలకు వైసీపీ కార్యకర్తలు అండగా నిలవాలి: పేర్ని నాని
AP: గ్రామాల్లో కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి వైసీపీ కార్యకర్తలు అండగా నిలవాలని మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆయన మాట్లాడుతూ.. సాగునీరు, తాగునీరు లేకపోయినా సారా మాత్రం విచ్చలవిడిగా అందుబాటులో ఉందని ఆయన విమర్శించారు. కొత్త పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేశారని, చంద్రబాబు పేదలకు ఒక్క సెంటైనా స్థలం ఇవ్వలేదని నిలదీశారు. ఎలాంటి ఉద్యమాలు లేకుండా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్