యూరియా కొరతపై రైతులు ఆందోళన పడొద్దు: అచ్చెన్నాయుడు

6914చూసినవారు
యూరియా కొరతపై రైతులు ఆందోళన పడొద్దు: అచ్చెన్నాయుడు
యూరియా కొరతపై రైతులు ఆందోళన పడొద్దని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం శ్రీకాకుళంలోని తండెంవలస గ్రామంలో యూరియా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘రైతులు ఏడాది అంతటికి ఒకేసారి నిల్వ చేసుకోవాలనే ఆలోచనతోనే యూరియా సమస్య తలెత్తింది. ఎకరాకు 25 కేజీల చొప్పున మూడు విడుతలుగా రైతులకు యూరియా అందిస్తాం. అవసరమైతే ఇంటింటికీ యూరియా ఇస్తాం. రూ.300 కంటే ఎక్కువకు అమ్మితే చట్టపరమైన చర్యలు ఉంటాయి’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్