చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు నష్టాలే మిగిలాయి: బొత్స

1704చూసినవారు
చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు నష్టాలే మిగిలాయి: బొత్స
AP: చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు నష్టాలే మిగిలాయని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో ఈదురుగాలులకు దెబ్బతిన్న బొప్పాయి, అరటి పంటలను శనివారం ఆయన పరిశీలించారు. అరటి, బొప్పాయి రైతులకు లక్షల్లో పెట్టుబడి నష్టం కలిగిందని, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. అరటి, బొప్పాయికి ఎకరాకు లక్ష, మొక్కజొన్నకి రూ.50 వేలు ఇవ్వాలని, గత తుఫాన్ నష్టాన్ని కూడా కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్