సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు.. ఉద్రిక్తత (వీడియో)

7చూసినవారు
AP: కృష్ణా జిల్లా పెడన మండలం పెందురులో శుక్రవారం రైతులు రోడ్డెక్కారు. దాళ్వా పంటకు సాగునీరు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనను అడ్డుకోవడంతో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంటకు సాగునీరు ఇస్తామని ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్