నేపాల్‌లోని కావ్రేపలాంచోక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 24 మంది ప్రయాణికులతో కొండ ప్రాంత రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.