బస్సు, ట్రక్కు ఢీ.. ఏడుగురు సజీవదహనం (వీడియో)

22704చూసినవారు
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించంది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై కొల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారపుర సమీపంలో బుధవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళ్తున్న లగ్జరీ బస్సు, వేగంగా దూసుకొచ్చి ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో రెండు వాహనాల్లో మంటలు చెలరేగి, ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమవగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు అతివేగం, డ్రైవర్ కునుకు తీయడమే ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్