ఘోర రోడ్డు ప్రమాదం.. వరుసగా ఢీ కొన్న మూడు కార్లు (వీడియో)

8588చూసినవారు
TG: నల్గొండ(D) చిట్యాల(M) గుండ్రంపల్లి గ్రామ శివారు హైవేపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి HYD వెళ్తున్న రోడ్డులో ఒకదానితో మరొకటి వరుసగా మూడు కార్లు ఢీ కొన్నాయి. ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడం వల్ల వెనుక వస్తున్న రెండు కార్లు ఢీ కొని నుజ్జునుజ్జు అయ్యాయి. మూడు కార్లలో మొత్తం పది మంది ప్రయాణికులు ఉండగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రోడ్డుపై అడ్డంగా ఉన్న కార్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్