AP: పూతలపట్టు ఐరాల మండలం చిగరపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎగువ పాలకూరు గ్రామానికి చెందిన సుధా, చంటి అనే యువకుడు మృతి చెందారు. అనారోగ్యంతో ఉన్న కుమారుడిని చూసేందుకు వెళ్తున్న సుధాను, తోడుగా వెళ్తున్న చంటిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంటి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సుధా చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.