ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో ఉంటానని చెప్పిన కూతురిని తండ్రే కర్కశంగా హత్య చేశాడు. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన చౌడేశ్వరి (22), నాగరాజు గత నెల 4న ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకున్నారు. అయితే మాట్లాడుకుందాం రండి అని వారిని తిరిగి మాచర్లకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 18న యువతి తండ్రి ఆమె గుండెలపై కూర్చొని ఊపిరాడకుండా చేసి, తర్వాత ఉరేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.