కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ముమ్మిడివారి పాడు గ్రామానికి చెందిన నల్ల ఏసుబాబు.. పుట్టుకతో అంధురాలైన తన పెద్ద కుమార్తె నల్లా స్వాతి దేశభక్తి గీతం పాడాలన్న కోరిక తీర్చాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వేడుకున్నారు. ఈ కోరిక తీర్చేందుకు పవన్‌ను కలవడానికి ప్రయత్నించి విఫలమైన ఏసుబాబు, తన కుమార్తె కోరిక నెరవేర్చే మార్గం కోసం ఎదురుచూస్తున్నారు.