తండ్రికి వీడియో కాల్‌‌లో అంత్యక్రియలు.. బంధాలెక్కడ! (వీడియో)

9248చూసినవారు
హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఓ వృద్ధ వ్యాపారవేత్త వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడినా చివరికి నా అనే వాళ్లు లేకుండా పోయారు. తండ్రి మృతదేహాన్ని చూసేందుకు కుమార్తెలు ప్రత్యక్షంగా రాకుండా, అంత్యక్రియలను వీడియో కాల్‌లో వీక్షించడం తీవ్ర చర్చకు దారితీసింది. అంత్యక్రియల ఖర్చుల కోసం ఎన్జీవో సంస్థకు రూ.5,100 పంపినట్లు సమాచారం. తల్లిదండ్రులకు చివరి క్షణాల్లో తోడుగా నిలవాల్సిన పిల్లలు బాధ్యత మరిచి అమానుషంగా ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్