ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురు.. కత్తితో పొడిచి చంపిన తండ్రి

6633చూసినవారు
ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురు.. కత్తితో పొడిచి చంపిన తండ్రి
ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురిని తండ్రి కత్తితో పొడిచి చంపిన దారుణం చోటు చేసుకుంది. బదౌసా పీఎస్ పరిధిలోని బర్చా గ్రామానికి చెందిన శివాని (19) మే 18న తన ప్రియుడు లలిత్‌ను ఆలయంలో వివాహం చేసుకుంది. యువతి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం మధ్యప్రదేశ్‌లో వారిని గుర్తించి బదౌసా PSకు తరలించారు. పోలీసుల సమాచారంతో అక్కడికి వచ్చిన యువతి తండ్రి సత్యకుమార్ ఆగ్రహంతో తన కుమార్తెపై కత్తితో దాడి చేశాడు. పోలీసులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శివాని మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్