పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని గండిపేట పరిసరాల్లో ప్రధాన యూనిట్, రామోజీ ఫిల్మ్ సిటీలో రెండో యూనిట్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాయి. డిసెంబర్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో మేకర్స్ దూసుకెళ్తున్నారు.