పాల కల్తీపై ఎఫ్‌డీఏ ఉక్కుపాదం

1045చూసినవారు
పాల కల్తీపై ఎఫ్‌డీఏ ఉక్కుపాదం
మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) పాల కల్తీని అరికట్టేందుకు జులై 3 నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. పాశ్చరైజ్డ్ పాలను సీల్ చేసిన, సరిగ్గా లేబుల్ చేసిన ప్యాకేజింగ్‌లోనే విక్రయించాలి. పాలు సేకరించిన చోటు నుంచి వినియోగదారుడి వరకు ప్రతి దశను ట్రాక్ చేసే రికార్డులు తప్పనిసరి. నిల్వ, రవాణాకు ఫుడ్-గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్లను మాత్రమే వాడాలి. ముడి పాలపై 'ఉపయోగించడానికి ముందు తప్పనిసరిగా వేడి చేయండి' అనే హెచ్చరిక తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.10 లక్షల వరకు జరిమానాతో పాటు క్రిమినల్ చర్యలు ఉంటాయని FDA హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్