దేశీయంగా ప్రైవేట్ పెట్టుబడులు గణనీయంగా పెరిగితేనే భారత్ ఆశించిన స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించగలదని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. కార్పొరేట్ రంగం నుంచి స్థిరమైన పెట్టుబడులు కనిపించడం లేదని, 50 శాతం టారిఫ్‌ల భారంతో అమెరికా-భారత్ బంధంపై అనిశ్చితి కూడా పెట్టుబడులకు ప్రతిబంధకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో ఎఫ్‌డీఐ గణాంకాలు ప్రతికూలంగా నమోదయ్యాయి, వచ్చిన పెట్టుబడుల కన్నా 446 మిలియన్ డాలర్లు అధికంగా వెళ్లిపోయాయి. తమిళనాడు వంటి రాష్ట్రాలు ఎఫ్‌డీఐలను ఆకర్షించగలుగుతున్నప్పటికీ, విస్తృత స్థాయిలో పెట్టుబడులు తరలిపోవడానికి గల కారణాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని రాజన్ సూచించారు.