జనసేన ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి అదృశ్యం

3464చూసినవారు
జనసేన ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి అదృశ్యం
AP: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగిని అదృశ్యమైంది. ఆమె వీడియో కాల్స్, స్క్రీన్‌షాట్‌లు విడుదల చేసి, మీడియా సమావేశంలో ఆరోపణలు చేసిన తర్వాత కనిపించకుండా పోయింది. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 7న, మహిళా ఉద్యోగిని తన కొడుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ ఫిర్యాదు చేశారు. రైల్వే కోడూరు అర్బన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హర్ష వీణ కాల్ డేటా, సాంకేతిక అంశాలపై దృష్టి సారించి, వీడియోలు, ఆడియోలు, ఫోటోలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్