ఫిఫా ప్రపంచ కప్-2026లో భాగంగా టొరంటోలో కెనడా, బోస్నియా జట్ల మధ్య జరిగిన గ్రూప్-బి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ డ్రాతో కెనడా తన ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో మొట్టమొదటి పాయింట్‌ను సాధించింది. మ్యాచ్‌లో బోస్నియా ఆటగాడు జోవో లుకిచ్ గోల్ చేయగా, కెనడా ఆటగాడు సైల్ లారిన్ గోల్‌తో సమం చేశాడు. ఈ టోర్నీకి కెనడా ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తోంది.