AP: కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద వల్లభుడి ఆలయం వద్ద కొంతకాలంగా ఆటో యూనియన్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాము ఆటో యూనియన్ సభ్యత్వాన్ని అమ్ముకుంటున్నామని ప్రచారం చేస్తున్నాడని గంగబాబుపై యూనియన్ నాయకులైన దవులూరి రామ్, లక్ష్మణ్‌లు విచక్షణారహితంగా దాడి చేశారు. గాయాలపాలైన గంగబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీని పరిశీలించి ఇద్దరిపై రౌడీషీట్ తెరిచారు.