హీరో నితిన్‌తో తనకు గతంలో వచ్చిన చిన్న ఇష్యూ గురించి ఓ ఇంటర్వ్యూలో మెగా హీరో వరుణ్ తేజ్ వివరించారు. ఆ తర్వాత తామిద్దరూ మంచి స్నేహితులుగా మారినట్లు తెలిపారు. ఓ దర్శకుడు ఇద్దరికీ ఒకే కథ చెప్పడం, నితిన్ చేయాలనుకున్న ప్రాజెక్టును వరుణ్ ఒప్పుకోవడం వంటి సంఘటనల వల్ల ఈ ఇష్యూ వచ్చిందన్నారు. అయితే వరుణ్ నితిన్‌కు ఫోన్ చేసి వివరించడంతో సమస్య పరిష్కారమైందని తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఇలాంటివి సాధారణమని, గతంలో కూడా ఇలాంటి కథల మార్పిడులు జరిగాయని వరుణ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.