సచివాలయ ఉద్యోగులపై కేసులు పెట్టడం దుర్మార్గం: కన్నబాబు

1017చూసినవారు
సచివాలయ ఉద్యోగులపై కేసులు పెట్టడం దుర్మార్గం: కన్నబాబు
AP: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందని, ఉద్యోగులను, ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని,  చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులను గౌరవంగా చూసుకుంటానని చెప్పి ఇప్పుడు వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్