సినీ పరిశ్రమలో నిర్మాణ వ్యయం అదుపు తప్పుతోందని, డబ్బు దుర్వినియోగంపై చర్చ జరుగుతోందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి సినిమాలోనూ అవినీతి జరుగుతుందని, నిర్మాత డబ్బు అంటే అందరికీ చులకన అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము పూర్తిగా ఇన్వాల్వ్ అయినా కొంత డ్యామేజ్ ఉంటుందని, కానీ నిర్మాత కంట్రోల్ లేని సినిమాల్లో ఈ డ్యామేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. చివరి నిమిషంలో అడగడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయని వివరించారు.