న్యూజిలాండ్‌తో చివరి టీ20.. అక్షర్ పటేల్ రీఎంట్రీ!

1233చూసినవారు
న్యూజిలాండ్‌తో చివరి టీ20.. అక్షర్ పటేల్ రీఎంట్రీ!
టీ20 ప్రపంచకప్-2026కు ముందు చివరి టీ20 మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. శనివారం తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో ఐదో టీ20లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి నాలుగో టీ20లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ ఆఖరి మ్యాచ్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. నాగ్‌పూర్‌లో గాయపడిన అక్షర్ పటేల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. వరల్డ్ కప్‌కు ముందు అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని కెప్టెన్ సూర్యకుమార్ పేర్కొన్నాడు. దీంతో తిరువనంతపురం టీ20కి అతడు అందుబాటులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్