AP: స్థానిక సంస్థలకు రూ.548.28 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2025-26 సంవత్సరానికి టైడ్ గ్రాంట్ కింద జిల్లా, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు కేటాయించింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.