అక్టోబర్‌ 4న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం

17752చూసినవారు
అక్టోబర్‌ 4న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం
AP: అక్టోబరు 4న 'ఆటో డ్రైవర్ల సేవలో' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు  తెలిపారు. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సహాయం అందనుందని ఆయన పేర్కొన్నారు. అర్హుల జాబితాలో ఎవరి పేరు లేకపోయినా, గ్రీవెన్స్ ద్వారా చేర్చుకునే అవకాం ఉంటుందన్నారు. ఈ పథకానికి 2,90,234 మంది లబ్ధిదారులుగా ఉన్నారని, దీనికి రూ.435 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం రూ.12,000 మాత్రమే ఇచ్చిందని, తాము రూ.15,000 అందిస్తున్నామని సీఎం వెల్లడించారు.

సంబంధిత పోస్ట్