ఏపీలో తుపాను బాధితులకు ఆర్థిక సాయం

22చూసినవారు
ఏపీలో తుపాను బాధితులకు ఆర్థిక సాయం
AP: తుపాను బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పునరావాస కేంద్రాలకు చేరుకున్న ప్రతి బాధితుడికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నప్పటికీ, గరిష్ఠంగా రూ.3000 వరకు అందజేయాలని ప్రభుత్వం పేర్కొంది. పునరావాస కేంద్రాల నుంచి తమ ఇళ్లకు తిరిగి వెళ్లే ముందు ఈ నగదును బాధితులకు అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్