ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం

12625చూసినవారు
బెంగళూరులోని జ్ఞాన భారతి మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. కేరళంకు చెందిన ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కేరళంలోని పయ్యన్నూరు నుంచి బెంగళూరుకు వస్తున్న బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగి, వేగంగా బస్సు లోపలికి వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్‌తో పాటు బస్సులోని ఇద్దరు ప్రయాణికులు వెంటనే కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్