AP: విశాఖపట్నంలోని సీ హార్స్ జంక్షన్ వద్ద ఉన్న ఒక స్క్రాప్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతుండటంతో, దుకాణానికి సమీపంలోనే ఉన్న పెట్రోల్ బంక్ వద్ద కలకలం రేగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.