AP: విశాఖలోని ఈస్ట్ ఇండియా పెట్రో కెమికల్స్‌లోని ఫిల్టర్ ట్యాంకర్‌పై ఆదివారం పిడుగుపడి మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా అదే ప్రాంతంలో మరోసారి మంటలు చెలరేగాయి. ఇథనాల్ ట్యాంకర్ పైభాగంలో పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించడాన్ని సిబ్బంది గుర్తించారు. దీంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది. హెలికాప్టర్ సాయంతో మంటల్ని అదుపు చేస్తున్నారు.