హిందుస్థాన్ లివర్ కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

7809చూసినవారు
హిందుస్థాన్ లివర్ కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం
TG: రంగారెడ్డి(D) నందిగామ(M) అంతిరెడ్డిగూడ శివారులోని హిందుస్థాన్ లివర్ కంపెనీ వేర్‌హౌస్‌లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. కట్టెలు, థర్మకోల్ తదితర వ్యర్థాలకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

సంబంధిత పోస్ట్