విజయవాడ ఇబ్రహీంపట్నంలోని YCP నేత జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై జోగి రమేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు ముట్టడికి వస్తున్నారని తెలియడంతో జోగి రమేష్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆగ్రహంతో కొందరు ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. YCP నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.