అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో భారీ కార్చిచ్చు సంభవించింది. పరిస్థితి తీవ్రంగా మారడంతో భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఎంఐ-17వీ5 హెలికాప్టర్లతో 12 వేల లీటర్ల నీటిని మంటలపై జల్లింది. దాదాపు 9,500 అడుగుల ఎత్తు నుంచి ఆపరేషన్ నిర్వహించడం పెను సవాల్‌గా మారింది. అటవీశాఖ అధికారులతో కలిసి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదే సమయంలో నాగాలాండ్, మణిపుర్ రాష్ట్రాల్లోనూ అడవుల్లో మంటలు చెలరేగాయి.