విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు

21780చూసినవారు
విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు
AP: అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ప్రైవేట్ స్కూల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పుట్లూరు నుంచి కడవకల్లుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు రావడాన్ని గమనించి డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. బస్సును రోడ్డు పక్కకు నిలిపి.. విద్యార్థులందరినీ కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.

సంబంధిత పోస్ట్