అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ పరిసరాల్లో అగ్నిప్రమాదం

15860చూసినవారు
AP: కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ పరిసరాల్లో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై పడమటి రాజగోపురం వద్ద ఉన్న దుకాణ సముదాయంలో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఫ్యాన్సీ షాపుతో పాటు మరో ఐదు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం.