ప్రైవేట్ బస్సులో వ్యాపించిన మంటలు.. తప్పిన ప్రమాదం (వీడియో)

14చూసినవారు
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం పులపర్తి జంక్షన్ వద్ద బుధవారం ఓ ప్రైవేట్ బస్సు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఏటికొప్పాక నుంచి అచ్యుతాపురం పరిశ్రమకు మహిళా కార్మికులను తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తమై, ప్రమాదాన్ని వెంటనే గుర్తించి, బస్సులోని ఐదుగురు మహిళా కార్మికులను చాకచక్యంగా కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ క్షేమంగా బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్