ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణానికి తొలి అడుగు

7464చూసినవారు
AP: ఆకివీడులో శిథిలమైన రామాలయ పునర్నిర్మాణానికి తొలి అడుగు పడింది. రామాలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో శిథిలాలను తొలగించి, నేలను చదును చేశారు. త్వరలోనే బ్రహ్మ ముహూర్తాన పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు భారీగా మోహరించారు. పునర్నిర్మాణానికి ఇప్పటికే కోటి రూపాయల విరాళాలు అందాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్