2026-27 ఆర్థిక సంవత్సరానికి 4.3% ద్రవ్యలోటు అంచనా

4615చూసినవారు
2026-27 ఆర్థిక సంవత్సరానికి 4.3% ద్రవ్యలోటు అంచనా
2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ జీడీపీలో 4.3 శాతం ద్రవ్యలోటును కేంద్రం అంచనా వేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలతో పోలిస్తే స్వల్పంగా తగ్గడం గమనార్హం. ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ, ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేలా ఈ లక్ష్యాన్ని నిర్దేశించామని మంత్రి తెలిపారు. పెట్టుబడి ఆధారిత వృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతామని, ఈ బడ్జెట్‌లో మూలధన వ్యయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్