ఫిట్‌నెస్ ఛార్జీలు తగ్గించాలి: లారీ ఓనర్ల సంఘం

222చూసినవారు
ఫిట్‌నెస్ ఛార్జీలు తగ్గించాలి: లారీ ఓనర్ల సంఘం
AP: మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో సరకు రవాణా లారీలు బంద్ పాటించనున్నాయి. ఫిట్‌నెస్ ఛార్జీలు తగ్గించాలని లారీ ఓనర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. అర్ధరాత్రి నుంచి ఏపీలో 15 ఏళ్లు దాటిన ట్రక్కులు నిలిపివేయాలని లారీ ఓనర్ల సంఘం నిర్ణయించింది. అన్ని గూడ్స్ షెడ్లు, షిప్ యార్డుల నుంచి ట్రక్కులు నిలిపివేయాలని నిర్ణయించింది. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల నుంచి సరకు రవాణా నిలిచిపోనుంది.

సంబంధిత పోస్ట్