సముద్రంలో గల్లంతైన ఏడుగురిలో ఐదుగురి ఆచూకీ లభ్యం.. ఇద్దరి కోసం గాలింపు

10657చూసినవారు
AP: విశాఖపట్నం చేపల రేవు నుండి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులలో ఐదుగురి ఆచూకీ లభించింది. వీరిలో కారె చిన్నయ్యను వాణిజ్య నౌక సిబ్బంది కాపాడగా, మరో నలుగురు అతనితో పాటు వాణిజ్య నౌక ఎక్కలేకపోయారు. వీరి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన ఇద్దరు జాలర్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈనెల 1వ తేదీన విశాఖ నుంచి చేపల వేటకు వెళ్లిన వీరు, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్